అర్థరాత్రి మహిళా వలంటీరుకు వేధింపులు

0 17

విజయవాడముచ్చట్లు:

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ఎమ్మార్వో ప్రభాకర్‌ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సస్పెండ్ చేశారు. జగనన్న ఇంటి పట్టాల మంజూరులో భారీ అవకతవకలకు పాల్పడినట్టు తహసీల్దార్‌పై ఆరోపణలు వచ్చాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన అనర్హులకు డబ్బులు తీసుకుని ఇంటి పట్టాలు మంజూరు చేశారు. డబ్బులివ్వలేదనే అక్కసుతో అర్హులకు ఇంటి పట్టాలు రాకుండా అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తహసీల్దార్ వ్యవహారంపై గుర్రుగా ఉన్న అధికార వైసీపీ నేతలు ఏకంగా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో విషయం సీరియస్‌గా మారింది. లంచగొండి ఎమ్మార్వో మాకొద్దు అంటూ స్థానికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ సమయంలోనూ అవినీతికి పాల్పడినట్లు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఓ మహిళా వాలంటీర్ ఫిర్యాదుతో తహసీల్దార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం.సదరు వాలంటీర్ ఎమ్మార్వో అక్రమాలను పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిందని తహసీల్దార్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ప్రభాకర్, అతని సోదరుడు, లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, రత్నా రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్‌కి ఫోన్ చేసి అసభ్యకరంగా దూషించారన్న ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి వేళ 22 సార్లు ఫోన్ కాల్స్ చేసి తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఎమ్మార్వో వ్యవహారశైలిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Harassment of a late night female volunteer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page