ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 22వ చిత్రం

 

సినిమా ముచ్చట్లు:

డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించ‌నున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సోమ‌వారం(జూలై5), క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యాన‌ర్‌లో ఇంత‌కు ముందు క‌ళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం `118`సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌ళ్యాణ్‌రామ్ చేయ‌బోయే  సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చిత్ర ద‌ర్శ‌కుడు, హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Nandamuri Kalyanram 22nd film on East Coast Productions banner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *