ఉద్రిక్తతంగా జింఖానా

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాసేపట్లో హెచ్ సి ఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నది.. ఈ ప్రెస్ మీట్ కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇటువంటి ప్రెస్ మీట్ నిర్వహించకూడదని పోలీసులు స్పష్టంగా వ్యక్తం చేసినప్పటికీ కూడా అపెక్స్ కౌన్సిల్ జింఖానా గ్రౌండ్ లో ప్రెస్ మీట్ నిర్వహిం చేందుకు సన్నాహాలు సిద్ధం చేసింది. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా జింఖానా గ్రౌండ్ బయట భారీగా మోహరించారు.దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే HCA అధ్యక్షుడు అజహారుద్ధీన్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసుల భద్రత పెంచారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జింఖానా నుంచి అజార్‌ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్‌ గ్రూప్‌, జాన్‌ మనోజ్‌ గ్రూప్‌లను పోలీసులు అడ్డుకుంటున్నారు. కొన్ని రోజులుగా హెచ్‌సీఏలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు అంబుడ్స్‌మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయంపై మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్‌కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్‌ మనోజ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ ఫిర్యాదు మేరకు అంబుడ్స్‌మన్ దీపక్‌ వర్మ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Tense gymkhana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page