ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుండా గిరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ

0 5

అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుడి పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
పోలీసులను నిలదీసిన సతీష్ మాదిగ
పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
అచ్చంపేట ముచ్చట్లు:

 

 

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ  లింగాల మండల పరిధిలోని కొత్త కుంట పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ రెడ్డి పై ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేయడాన్ని డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు.  సోమవారం లింగాల పోలీస్ స్టేషన్ ముందు డిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గూండా గిరి కి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు.  నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాలేదని,  గూండా గిరి చేసేందుకు వచ్చాడని,  పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులతో దాడులు చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వమా లేక గుండా ప్రభుత్వ అని ఆయన ప్రశ్నించారు.  ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే అండగా ఉంటానని,  ఎవరు అధైర్య పడవద్దని కార్యకర్తలకు సూచించారు.  ఎమ్మెల్యే అక్రమ సంపాదన తో మరింత మదమెక్కి దాడులు చేస్తున్నారని విమర్శించారు.  ధర్నా చేస్తున్న డిసిసి అధ్యక్షుడు తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
బాధితుడు మాట్లాడుతూ అంతకుముందు బాధితుడు జ్ఞానేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వాహనం ఆదివారం రాత్రి తన ఇంటి ముందుకు వచ్చి రాజకీయం చాలా ఎక్కువ అయింది రా అంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై పై కి వచ్చాడని,  తన డ్రైవర్ కు ఎమ్మెల్యే పురమాయించడం తో నాపై చెయ్యి చేసుకున్నాడని బాధితులు తెలిపారు.  ఈ క్రమంలో పోలీసులు నన్ను పట్టుకున్నారని బాధితుడు వాపోయాడు.
పోలీసులను నిలదీసిన సతీష్ మాదిగ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జ్ఞానేశ్వర్ రెడ్డి పై ఎమ్మెల్యే దాడి చేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ ఆదివారం అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులను నిలదీశారు.  అప్రజాస్వామికంగా ఒక ప్రజా ప్రతినిధి దాడులు చేయడం నిస్సిగ్గు తనమని,  పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారకూడదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని,  ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని నిలదీశాడు. పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడంటే పరిస్థితి మరింత విషమంగా మారుతుందని,  తనపై కేసు నమోదు చేసేంతవరకు కదిలేది లేదని… వాదిస్తూ కేసు నమోదు అనంతరం స్టేషన్ నుంచి వెనుదిరిగారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:We will campaign against Giri through MLA Guvala Balaraju
DCC President Dr. Vamsi Krishna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page