ఏనుగుల ధ్వంస రచన

0 20

చిత్తూరు    ముచ్చట్లు:
గజరాజులు మకాం మార్చాయి వి.కోట పరిసరాల్లోకి ప్రవేశించాయి. అర్ధరాత్రి అరటి..టమోటా తోటలను ధ్వంసం చేశాయి అపార నష్టాన్ని మిగిల్చాయి. అటవీ శాఖ తీరుపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి,కుమ్మరమడుగు  గ్రామల్లో నిన్న అర్ధరాత్రి ఏనుగులు పంట పొలాలపై స్వైరవిహారం చేశాయి..రైతుల కథనం మేరకు నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు సోమశేఖర్ 1400 వందల అరటి మొక్కలు పెంపకానికి 3 లక్షలు  ఖర్చు పెడితే రాత్రికి రాత్రే ఏనుగులు ధ్వంసం చేసి నేలమట్టం చేశాయని ఆవేదన చెందారు.అప్పులు చేసి పంట చేస్తే ఏనుగులు నాశనం చెయ్యడంతో కన్నీటి పర్యంతమయ్యారు..పంట నాటిన మూడు నెలలకు ముందు  ఇదే రకంగా ఏనుగులు ధ్వంసం చేసి సర్వ నాశనం చేశాయన్నారు.2 లక్షలు నష్టపోయామన్నారు.అటవీశాఖ 10 వేలు పరిహారంతో చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పంట మొదట్నుంచీ మొక్కలు నాటి,మిగిలిన మొక్కల్ని రక్షించుకుంటూ వచ్చామన్నారు.ప్రస్తుతం అరటి తోట గెలలు తోశాయి.నెల రోజుల్లో కోత కోయాల్సి ఉంది.ఈ తరుణంలో రాత్రి 14 ఏనుగుల గుంపు మూకుమ్మడిగా తోటలోకి ప్రవేశించి పంటను తొక్కి తిని నాశనం చేశాయి.సుమారు 3 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు తెలిపారు.అనంతరం కుమ్మరమడుగు గ్రామానికి చెందిన రైతు సోమప్ప టమోటా,బీన్స్ తోటలపై విరుచుకుపడ్డాయి.కోత దశలో ఉన్న టమోటా తోట,బీన్స్ నేలమట్టం చేశాయి.నీటి సరఫరా పైపులు,గేట్వాల్వులు,సైతం ధ్వంసం చేశాయి.కాపల గుడిసెను  కూల్చాయి.ఎప్పుడూ గుడిసెలు ఉంటూ పంటను వన్య మృగాల నుంచి రక్షించుకునే వాళ్లు.అయితే నిన్న పంట కాపలాకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.లేకపోతే ప్రాణాపాయం జరిగేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.2 లక్షల నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు. అరకొర పరిహారం తో చేతులు దులుపుకోవడం రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Annihilation of elephants

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page