ఏపీలో 53వేల టీచర్‌ పోస్టుల రద్దు

0 31

ఒంగోలు ముచ్చట్లు :

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం అమలు వలన రాష్ట్రంలో 53వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉందని శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన యూటీఎఫ్‌ జిల్లా సీపీఎస్‌ సబ్‌ కమిటీ విస్తృతస్థాయి ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన విద్యావిధానం అమలు వలన 3,4,5 తరగతులు చదివే పిల్లలు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూళ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. దీని వలన డ్రాప్‌ అవుట్‌లు పెరిగే అవకాశం ఉందని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులను దూరంగా ఉన్న పాఠశాలలకు పంపడం సరికాదని అయన ఆక్షేపించారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Cancellation of 53 thousand teacher posts in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page