ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

0 23

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకితే సెలవులు మంజూరు చేసేందుకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులతో పాటు 5 రోజులు కమ్యూటెడ్ సెలవులకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజులు సెలవు మంజూరు చేసే ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారని ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వస్తే 28 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 20 రోజులు సెలవులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై సీఎం సంతకం చేశారని ఆయన తెలియజేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారన్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Good news for AP government employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page