గోవులను తరలించే ప్రాంతాల్లో నిరంతర నిఘా

0 6

-బక్రీద్ సందర్భంగా భద్రత పరమైయన ఏర్పాట్లు పూర్తి చేయాలి
– సామాజిక మాధ్యమాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేస్తే కఠిన చర్యలు
-రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

రాబోవు బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోవుల అక్రమ రవాణా, గోవధను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం రాబోవు బక్రీద్ సందర్భంగా జిల్లాలలో తీసుకోవలసిన భద్రత పరమైన ఏర్పాట్లు,గోవధ నివారణ, అక్రమ రవాణాను  నివారించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా ఎస్పీ లు, కమిషనర్ లతో, వెటర్నరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాబోవు బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోవుల అక్రమ రవాణా, గోవధను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా అధికారులను ఆదేశించారు. సంతలో కొనుగోలు చేసిన పశువులకు, సంబంధిత పశు వైద్యాధికారిచే ఆరోగ్య , రవాణాకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని. ఇట్టి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా వాహనదారునితో పాటుగా ఉండాలి అన్నారు.

 

 

గోవుల రవాణా జరిగే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే సాకుతో  బృందాలుగా ఏర్పడి అల్లర్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మత పరమైన విద్వేషాలను రెచ్చగొట్టి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అవసరం అయితే వారిని బైండోవర్ చేయాలని అని అన్నారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నాలుగు నుండి ఆరు గంటల వరకు ఆంటీ డిస్గ్రేషన్ డ్రీల్ ను నిర్వహించాలని అన్నారు. పశు వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను కోఆర్డినేట్ చేసుకుంటూ వాటిని శుభ్రపరిచవిధంగా చూడాలని అన్నారు. జిల్లాలో ఉన్న అధికారులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా బక్రీద్ పండుగను జరిగే విధంగా చూడాలన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Continuous surveillance of areas where cows move

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page