గ్రామాల రూపు రేఖలు మార్చేందుకే పల్లె ప్రగతి   పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

0 11

రంగారెడ్డి  ముచ్చట్లు:
గ్రామాల రూపు రేఖలు మార్చేందుకే పల్లె ప్రగతి కార్యక్రమం అని రాష్ట పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. షాబాద్ మండలం సర్దార్ నగర్, కక్కులూర్ గ్రామాల్లో ఆయన పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఇంటిని రోజు శుభ్రం చేసినట్లే గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు.ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి కాపాడాలని సూచించారు.పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శం నిలుస్తుందన్నారు. ప్రతి గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జెడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, డీర్డీవో పీడీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Rural progress is about changing the shape of villages
Panchayati Raj Chief Secretary Sandeep Kumar Sultania

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page