చౌడేపల్లెలో ఆనందయ్య మందును సద్వినియోగం చేసుకోండి-జెడ్పిటీసీ దామోదరరాజు

0 18

చౌడేపల్లె ముచ్చట్లు:

 

 

ఆనందయ్య మందును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పిటీసీ దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి, బోయకొండ ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ లు సూచించారు. సోమవారం కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ,శేష వాహన కమిటీ , కడియాల మహేష్‌ బాబు సహకారంతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్యవైశ్యులకు, హమాలీ కూలీలకు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, పారిశుధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మందును పంపిణీ చేశారు. మందును వాడే విధానంను వివరించారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా వాడాలని, భౌతిక దూరం పాటిస్తూ వైద్యుల సలహాలు పాటించి కరోనా రహిత ప్రాంతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వరుణ్‌, ఆర్యవైశ్య సంఘం నేతలు నాగరాజ, కృష్ణ్రమూర్తి, సురేంద్ర, చందు, మంజునాథ్‌,ఇస్సా రాము,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Take advantage of Anandayya medicine in Choudepalle-ZPTC Damodarraju

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page