ఛీర్ ఫర్ ఇండియా ,సెల్ఫీ పాయింట్ ను అవిష్కరించిన కలెక్టర్

0 19

చిత్తూరు  ముచ్చట్లు:

రానున్న టోక్యో ఒలింపిక్స్ లో రాష్ట్రం తరఫున ఆడుతున్న క్రీడాకారుల ప్రతిభ లు అత్యున్నతంగా ఉండడం ద్వారా రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేసేలా చీర్ అప్ కార్యక్రమం ఉండాలని   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు కలెక్టర్ ఛాంబర్ లో చీర్ ఫర్ ఇండియా క్యాంపైన్ లో భాగంగా  సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాష్ట్రం తరఫున షటిల్ బాడ్మింటన్ ఆడుతున్న పి .వి.సింధు, షటిల్ బాడ్మింటన్ ఆడుతున్న సాత్విక్ సాయి రాజ్, చిత్తూరు జిల్లా నుంచి హాకీ క్రీడాకారిణి ఈ.రజని లకు మంచి జరగాలని ఒలింపిక్స్ లో పథకాలతో రావాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అన్నారు. 32వ ఒలింపిక్ క్రీడలు జపాన్లోని టోక్యోలో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగ నున్నాయి. ఈ క్రీడలలో చీర్ ఫర్  ఇండియా క్యాంపైన్ లో భాగంగా సెల్ఫీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా యువజన విభాగం కార్యదర్శి, జిల్లా క్రీడల కార్యదర్శి మల్లికార్జున్, డి డి సమాచారశాఖ ఐ .ఆర్ .లీలావతి,డి ఎస్ డి ఓ సయ్యద్,కోచ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Cheer for India, the collector who invented the selfie point

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page