పంట రుణాలకు దూరంగా బ్యాంకులు

0 12

నిజామాబాద్  ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్‌ సాగు మూడో వంతు పూర్తయినప్పటికీ, 26 బ్యాంకుల శాఖలు ఇప్పటి వరకు పంట రుణాల మంజూరు ప్రక్రియను అసలు షురూ చేయలేదంటే రైతుల పట్ల బ్యాంకర్ల తీరును అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని బ్యాంకుల శాఖలు సైతం నామమాత్రంగా రుణం మంజూరు చేశాయి. జిల్లాలో ఖరీఫ్‌ పనులు ఊపందుకున్నాయి.బోధన్, వర్ని తదితర మండలాల్లో పక్షం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌  నియోజకవర్గాల పరిధిలో సోయా, పసుపు వంటి పంటలు విత్తుకున్నారు. ఈ సీజనులో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, ఇప్పటికే 33 శాతం  పంటలు వేసుకున్నారు. కానీ పంట రుణాలు మాత్రం 12 శాతానికి మించలేదు. ఈసారి ఖరీఫ్‌లో సుమారు 2.38 లక్షల మంది రైతులకురూ.1,560.82 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.కానీ జూన్‌ నెలాఖరు వరకు కేవలం 26 వేల మంది రైతులకు రూ.172.65 కోట్లు మాత్రమే రుణం ఇవ్వగలిగారు. అంటే ఖరీఫ్‌ పనులు ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కనీసం 12 శాతం కూడా రుణాలు ఇవ్వలేదన్నట్లు స్పష్టమవుతోంది. ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు బ్యాంకులు ఖరీఫ్‌ రుణాలు మంజూరు చేస్తాయి. అయితే నిర్దేశించిన గడువులో నెల రోజులు ముగిసినప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

ఎప్పటిలాగే ఈసారి కూడా ఖరీఫ్‌ సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దుక్కులు దున్నడం కోసం ట్రాక్టర్, అరక ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటాయి. అలాగే ఎరువులు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు కావాలి. వీటికి తోడు కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలివ్వక పోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ ప్రక్రియ ప్రారంభించని బ్యాంకుల పరిధిలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.పంటరుణాలు తీసుకోవడమేమోగాని, ఆన్‌లైన్‌ పహణీలతోనే రైతులకు తీవ్ర ఇబ్బంది ఉంది. వేల్పూర్‌ మండలంలో చాలా మంది రైతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో భూముల వివరాలు ఉండడం లేదు. ఆన్‌లైన్‌ పహణీ లేకుంటే బ్యాంకు వారు ఒప్పుకోవడం లేదు. బ్యాంకు వారిని ఎంతో బతిమాలితే రాతపూర్వక పహణీకి ఒప్పుకుంటున్నారు. రాత పూర్వక పహణీ కోసం కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటోంది. వీఆర్వోలకు రెవెన్యూ సర్వే ఉండడం వల్ల వారు సర్వేకే వెళ్తున్నారు. ఆన్‌లైన్‌ పహణీలే ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు పచ్చలనడ్కుడ గ్రామీణ బ్యాంకులో మేనేజరు లేక రుణాల ప్రక్రియ ఆగిపోయింది.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Banks away from crop loans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page