పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి జగిత్యాల జిల్లా జడ్జి సుదర్శన్

0 9

జగిత్యాల  ముచ్చట్లు:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జగిత్యాల జిల్లా జడ్జి సుదర్శన్ పిలుపు నిచ్చారు.హరిత హారం కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల కోర్టులో జడ్జీలు, న్యాయవాదులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.ఈ సందర్బంగా జిల్లా జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.చెట్ల ధ్వారానే ప్రాణవాయువు లభిస్తుందని, అందుకే విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఈకార్యక్రమంలో జడ్జిలు వెంకటేశ్వర్ రావు, నిహారిక, ప్రతీక్ సిహగ్, వేణుగోపాల్ రావు, జిల్లా అటవీశాఖాధికారి వెంకటేశ్వర్ రావు, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాండ్ర సురేందర్, న్యాయవాదులు డబ్బు లక్ష్మా రెడ్డి, అంజయ్య, మధుసూదన్ రెడ్డి, దుర్గపు రవీందర్ గౌడ్,అటవీశాఖధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

- Advertisement -

Tags:Plants should be planted to protect the environment
Jagittala District Judge Sudarshan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page