పువ్వాడ నయన్ కు మరిచిపోలేని గిఫ్ట్

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

నందమూరి నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి అచ్చం తాత రామారావు పోలికలతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో ఈ తరం, ఆ తరం అనే తేడానే లేకుండా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు ఆయన సున్నితమైన మనస్తత్వం ఎందరో సెలబ్రిటీల హృదయాలకు కనెక్ట్ కావడంతో వాళ్లంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోయారు. సాధారణ ప్రజలు, సినిమా వాళ్ళే కాదు రాజకీయ నాయకులు, వారి వారి పిల్లలు ఎన్టీఆర్ అభిమానులుగా మారిపోయారు.ఇక వాళ్లంతా ఎన్టీఆర్‌ని కలిసేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆయనను కలిసి ఖుషీ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ తన కుమారుడితో కలిసి జూనియర్ ఎన్టీఆర్‏ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొడుకు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మీట్ జరిగింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నయన్.. తన బర్త్ డే నాడు ఆయన్ను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్‌లను కూడా కలిసి ఆశిర్వాదం తీసుకున్నారు పువ్వాడ నయన్.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ పూర్తికాగానే కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:An unforgettable gift to Puvada Nayan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page