ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా  రేషన్ కార్డులు మంజూరు చేయాలి

0 20

– నారాయణరెడ్డి పేట చేనేత కుటుంబీకుల వేడుకోలు

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రభుత్వ పథకాలు వర్తించు లాగున మాకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని స్థానిక నారాయణ రెడ్డి పేట చేనేత కార్మికులు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే లను వేడుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని నారాయణ రెడ్డి పేట, ద్వారకా నగర్ సచివాలయం-1 పరిధిలోని చేనేత వృత్తి పై జీవనాధారం సాగిస్తున్న మమ్మల్ని ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కష్టార్జితంతో కొనుక్కున్న సొంత స్థలాలలో 2018 -19 సంవత్సరంలో పి ఎం ఏ వై పథకం ద్వారా ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. చేపట్టిన గృహ నిర్మాణాలు ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన కారణంగా కెన్ ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేటు బ్యాంకుల నుండి లోన్లు తీసుకొని గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో లోన్లు తీసుకున్న సమయంలో ఐటీ రిటర్న్స్ చేసుకోవడంతో ప్రస్తుతం మాకు రేషన్ కార్డులు లేకుండా చేయడం జరిగిందని తమ ఆవేదన వ్యక్తపరిచారు.

 

 

 

ఈ కారణంగా చేనేత ఇతర కూలి పనుల పై ఆధారపడి జీవిస్తున్న మా కుటుంబాలలోని పిల్లలకు అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, చేనేత నేస్తం తదితర ప్రభుత్వ పథకాలకు అర్హత పొంద లేకున్నామని తమ మనోవేదనను ప్రభుత్వానికి వినిపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక శాసనసభ్యులు స్పందించి, సదరు విషయమై విచారణ చేపట్టి పేద కుటుంబీకుల మైన మాకు రేషన్ కార్డులు మంజూరు చేసి, ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధితులు మద్దిలి రాజు, కామాక్షి, సుంద రామారావు, మామిడి రాము, గౌరమ్మ ,కల్లూరు అప్పలరాజు, పావని, ఇంమంకీ వెంకన్న, లక్ష్మి, సోదా పార్వతి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Ration cards should be issued as applicable to government schemes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page