ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే డిగ్రీ పరీక్షలను ఆన్ లైన్‌లో నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ నుతెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పరీక్షలు మొదలైన నేపథ్యంలో వీటిపై జోక్యం చేసుకోలేవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేసి వర్చువల్ నిర్వహించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.దాఖలైన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విచారణ సాధ్యం కాదంటూ తీర్పు చెప్పింది. అయితే పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మొదలైన నేపథ్యంలో మొదలైన పరీక్షల గురించి వాదనలు వద్దని పేర్కొంది. మేము అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది..

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Initial degree examinations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page