బస్టాండ్ లో రోడ్డు మరమ్మత్తు పనులు

0 17

-తొలగిన ప్రయాణీకుల ఇబ్బందులు
-త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణం
– సర్పంచ్ మూల సుమలత

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో ఆది, సోమవారం గ్రామ సర్పంచ్ మూల సుమలత – శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. గత కొంత కాలం నుండి పూర్తిగా చెడిపోయిన రోడ్డు చిన్నపాటి చినుకులకే బురదమయమై చిత్తడిగా, ప్రయాణీకులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా ఉండేది. బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ స్పందించారు. దొడ్డు కంకర – డస్ట్ తో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ పని వలన ప్రధాన బస్టాండ్ లో బురద తొలగి పోవడమే గాక వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి. గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రయాణీకులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గ్రామంలోని వీధుల్లో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పలు సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందన్నారు. మరికొన్ని రోడ్లు కూడా విస్తరణ చేసి సిసి రోడ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ మూల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ సుద్దాల శరత చందర్ రావు, మండల కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, విడిసి వైస్ చైర్మన్ నక్క చంద్రమౌళి, విడిసి ప్రతినిధులు పెద్దనవేని రాఘన్న, పెద్దనవేని రెడ్డి, పరుమాల రాజన్న, చుక్క శంకరయ్య, మసర్ధి మల్లయ్య, మూల శంకరయ్య, బక్కశెట్టి రామన్న తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Road repair works at Busstand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page