మళ్లీ జనసేనాని యాక్టివ్

0 18

విజయవాడ ముచ్చట్లు:

జనసేన అధినేత రాజకీయంగా మళ్లీ బిజీ కానున్నారు. వరుస సినిమా షూటింగులు, కరోనా కారణంగా కొద్ది నెలలుగా రాజకీయాల్లో అంతగా యాక్టివ్ ఉండని ఆయన పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన కోసం జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ మరుసటి రోజు(జులై 7)న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ క్యాలెండర్ సహా పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా పవన్ చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం కానున్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Janasena active again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page