మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏడాది  పాటు సస్పెన్షన్

0 15

ముంబై  ముచ్చట్లు:

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గందరగోళం మద్య సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్షబీజేపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాయి. ఈ సమయంలో ఆయన ఛాంబర్‌లోకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం.రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ 12 మంది సభ్యులు స్పీకర్‌పై దాడిచేసే సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు.ఇవన్నీ తప్పుడు ఆరోపణలు.. కల్పిత కథనాలు సృష్టించారు.. బీజేపీ సభ్యులెవరూ స్పీకర్‌ను కించపరచలేదు’ అని ఫడ్నవీస్ మీడియాతో అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం 12 కంటే ఎక్కువ మంది సభ్యులం త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వర్షాకాల సమావేశాల్లో బీజేపీ అజెండాలో ముఖ్యమైన వాటిలో రిజర్వేషన్లు ఒకటి ఆయన స్పష్టం చేశారు.ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. స్పీకర్ భాస్కర్ జాదవ్ తమకు మాట్లాడటానికి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకునడంతో స్పీకర్ వాయిదా వేశారు. ‘‘ప్రతిపక్ష నేతలు నా క్యాబిన్‌లోకి వచ్చి అసభ్య పదజాలంతో దూషించారు.. దేవేందర్ ఫడ్నవీస్, సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు.. కొందరు నాపై భౌతిక దాడికి పాల్పడ్డారు’’ అని స్పీకర్ మీడియాకు తెలిపారు.అయితే, తనను కలవడానికి వచ్చిన నాయకులను స్పీకర్ కూడా అవమానించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని స్పీకర్ కోరారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఒక ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానించారు…

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:There are 12 BJP MLAs in Maharashtra
Suspension for one year

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page