రేవంత్ ప్రోగ్రాం కు అందరూ రావాలి:మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

0 21

హైదరాబాద్  ముచ్చట్లు:
ఈ నెల  7వ తేదీన పీసీసీ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా  రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకునే ప్రోగ్రాం కు అందరూ పాల్గొనాలి.  టీపీసీసీ నూతన కమిటీ వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో- ప్రజల్లో నూతన ఉత్తేజం వచ్చింది.  కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్  అన్నారు.   బీజేపీ కేంద్ర పాలన కేవలం అంబాని-ఆధాని కోసం మాత్రమే.  దేశ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.  తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.  కాంగ్రెస్ తెచ్చిన పథకాలకు కేసీఆర్ గోబ్బరికాయలు కొట్టి పబ్బం గడుపుకుంటున్నారు.   కాంగ్రెస్ నుంచి టీఆరెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలను దొంగల లాగా ప్రజలు చూస్తున్నారు.  కొత్తగా కట్టే సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీనే కొబ్బరికాయ కొడుతుంది.  జంట నగరాల్లో నభూతో నభవిష్యత్ అన్నట్లు 7వ తేదీన టీపీసీసీ నూతన కమిటీ ఛార్జ్ తీసుకుంటుంది.  తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు పార్లమెంట్ వీడియో క్లిప్ తీస్తే కొట్లాడింది ఎవరో తెలుస్తుంది.  వంద నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతా అన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి.  టీపీసీసీ నూతన కమిటీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు.  దళితుణ్ణి ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు!.  మాజీ హోమ్ మంత్రి నాయిని ని టీఆరెస్ చంపింది- మానసికంగా చంపుతారు …పాడేలు మోస్తరు.  ఆంధ్రా కాలేజీల దగ్గర కలెక్షన్స్ పేరుతో వేల కోట్లు కేసీఆర్ సంపాదిస్తున్నారు.  ఆంధ్రా వ్యక్తులు సినిమాలు తెలంగాణ లో తీయాలంటే టీఆరెస్ కు కమిషన్ ఇవ్వాల్సిందే.  కౌన్సిలర్ ఎన్నికల్లో హిందూ- మున్సిపల్ డ్రామా ఆడి ప్రజలను మోసం చేశారు. కరొనా సమయంలో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ- నేతలు.  ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేయలేరు!. పదేళ్లుగా నేను ఎంపీగా ఉన్నా.  ఒక్కసారి ఎమ్మెల్యే-ఎంపీ అయితే వేల కోట్లు సంపాదిస్తున్నారు.  మళ్ళీ దేశానికి- తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి.  బంగారు తెలంగాణ కాదు- శవాల తెలంగాణ తయారు అయింది.  వైఎస్సార్ ఆ మాత్రం అభివృద్ధి చేశారు కాబట్టే కేసీఆర్ ఇవ్వాళ వేలకోట్ల సంపాదించుకున్నారు.  పీవీ పేరుతో తెలంగాణాలో నాటకం చేస్తున్నారు- పీవీకీ కేసీఆర్ కు సంబంధం లేదు. యాదవులు అంటేనే మొదటి నుంచి ధనికులు- విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేందుకే గొర్రెల పంపిణీ చేస్తున్నారు.   గొర్ల పేరుతో కూడా టీఆరెస్ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారు.  హైదరాబాద్ రోడ్లన్నీ 7వ తేదీన గాంధీ భవన్ నే!.  పోలీసుల అనుమతి ఇవ్వక తప్పదని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Everyone should come to the Rewanth program: Former MP Anjan Kumar Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page