విద్యార్థులకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ ఎన్ ఎస్ యు ఐ  డిమాండ్

0 9

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:
పట్టణంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోన కేసులు  తగ్గుతున్న దృష్ట్యా ప్రతి విద్యార్థికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు  ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన తర్వాతే విద్యా సంస్థలను, ప్రవేశ ,ఇతర పరీక్షలను ప్రారంభించాలని, ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు  నీరజ్ కుందన్, జాతీయ కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ ఇంచార్జ్ నాగేష్ కరియప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నాగ మధు యాదవ్ పిలుపుమేరకు సోమవారం ఎమ్మిగనూరు  స్థానిక కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వసతి గృహాల రాష్ట్ర కన్వీనర్  వీరేష్ యాదవ్  మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి వెంటనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని, కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే కాంపిటేటివ్ ప్రవేశ ఇతర పరీక్షలు నిర్వహించాలని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్  చేశారు. పది ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారు ప్రస్తుతం సంభవిస్తున్న థర్డ్ వే కరోన, డెల్టా ప్లస్ మరియు ఇతర వ్యాధి లు విద్యార్థులకు సంభవించకుండా ఉండేందుకు ప్రత్యేక చికిత్స, మందులు, వ్యాక్సిన్ లపై దృష్టి సారించాలన్నారు. వ్యాక్సిన్ వేయకుండా విద్యా సంస్థలను ప్రారంభించడం, ప్రవేశ మరియు ఇతర విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ వేసిన తర్వాతే పలు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ స్థాయి పిలుపుమేరకు దేశ వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో  నాయకులు షేక్షావలి, సుధాకర్ ,దివాకర్, మనోజ్,అనంత కుమార్ ,హనుమంతు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Distribute the vaccine free of charge to students
NSUI demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page