సేమ్ సీన్…బాబు దారెటు

0 24

హైదరాబాద్  ముచ్చట్లు:

మహా చెడ్డ కష్టం టీడీపీ అధినాయకునికి వచ్చిపడింది. సరిగ్గా పదేళ్ల క్రిత్రం ఇలాంటి ఇరకాటమే చంద్రబాబుకు ఉమ్మడి ఏపీలో వచ్చింది. ఒకవైపు ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్ధించలేక, మరో వైపు ఏపీలో సమైక్య భావజాలానికి మద్దతు ఇవ్వలేక చంద్రబాబు నానా ఇబ్బందులు పడ్డారు. రెండు కళ్ళ సిద్ధాంతానికి ఆయన నాడు తెర తీసినా అది అభాసుపాలు అయింది. ఇపుడు మళ్ళీ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. అటు కేసీయార్ కృష్ణా జలాల దోపిడీ అంటున్నారు. ఇటు జగన్ మా హక్కు, మా నీరు అంటున్నారు. మధ్యన ఎటూ సమాధానం చెప్పలేక, ఏ విధంగానూ స్పందించలేక టీడీపీ అధినాయకత్వం పరేషాన్ అవుతోంది.జగన్ కి తెలంగాణా బాధ లేదు. అక్కడ ఆయన పార్టీ లేదు. ఆయన దాన్ని వదిలేసుకున్నారు. దాంతో గట్టిగానే రాయలసీమకు నీటి కోసం గొంతు పెంచుతున్నారు. ఏపీకి అన్యాయం జరగనివ్వబోమని కూడా స్పష్టం చేస్తున్నారు. మరో వైపు చెల్లెలు షర్మిల అయితే తెలంగాణా రాజకీయానికే పరిమితం అవుతానని డిసైడ్ అయింది. దాంతో ఆమె తెలంగాణా పక్షం వహిస్తూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. అలా అన్న చెల్లెలు బాగాపూ సర్దుకున్నారు. కానీ ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ జాతీయ హోదా కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు మాత్రం అసలైన ఇరకాటం వచ్చిపడుతోంది.చంద్రబాబు ప్రతీ చిన్న అంశాన్ని రాజకీయం చేస్తారు. ప్రతీ దాని మీద గట్టిగా మాట్లాడుతారు. కానీ తాను పుట్టిన రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతూంటే ఎందుకు గొంతు పెగల్చరు అంటోంది వైసీపీ. ముందు మీ స్టాండ్ ఏంటో చెప్పండి బాబు గారూ అంటూ నిగ్గదీస్తోంది. రాయలసీమకు మద్దతుగా మాట్లాడితే తెలంగాణాలో ఉందా లేదా అన్నట్లుగా పార్టీ పుటుక్కున తెగిపోతుంది. అలా కాదు తెలంగాణా పక్షమని చెబితే ఏపీలో పతనావస్థలో ఉన్న టీడీపీకి ఇక చూసుకోనక్కరలేదు.

 

- Advertisement -

దాంతో తాను ఏమీ మాట్లాడకుండా నాయకులను సైలెంట్ గా ఉండమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని టాక్అయితే మొదట్లో ఇది కేసీయార్, జగన్ ల మధ్య ఉత్తిత్తి యుద్ధమే అంటూ టీడీపీ అనుకూల మీడియా రాతలు రాసినా కూడా రాను రానూ జల జగడం పెరిగి పెద్దది అవుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని నిలిపివేయడం అబద్ధం కాదు, క్రిష్ణా నీరు తీసుకెళ్ళి విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణా వాడడమూ అవాస్తవం కాదు. దీని మీద జగన్ ప్రధానికి లేఖ రాసి పోరాటానికి సై అంటున్నారు. మరి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇంకా రాజాకీయ విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని దాటవేయడం సరికాదు అన్నది ఆ పార్టీ సీమ తమ్ముళ్ళ మాటగా ఉంది. సీమ ప్రయోజనాల కోసం మేమున్నామని టీడీపీ గట్టిగా చెప్పకపోతే రేపటి రోజున ఓట్లు ఎలా అడుగుతారు అన్నది కూడా అతి పెద్ద ప్రశ్నగా ఉంది. మొత్తానికి చంద్రబాబు రెండు కళ్ళు కాదు మూడవ కన్ను తెరవాల్సిన టైమ్ వచ్చేసింది అంటున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Same scene … Babu Daratu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page