అరకు ఎం.పిని కలసిన కాంట్రాక్ట్ రెసిడెన్సీయల్ ఉపాధ్యాయుల సంఘం సి.ఆర్.టి రాష్ట్ర అధ్యక్షుడు టి.నూకరాజు వెల్లడి

0 6

విశాఖపట్నం    ముచ్చట్లు:
రాష్ట్రం వ్యాప్తంగా పని చేస్తున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కరానికి అరకు ఎం.పి ని కెడి పేటలో తన నివాసంలో  కలిసిన సి ఆర్ టి సంఘం.తమ సమస్యల గురించి మాట్లాడుతూ2021-22 విధ్యా  సంవత్సరానికి గాను పన్నెండు నెలల పది రోజుల వ్యవధితో కూడిన రెవిన్యూవల్ ఆర్డర్స్ త్వరగా తెప్పించుట కొరకు. షెడ్యూల్డ్ ఏరియా స్పెషల్ డి ఎస్ సి నిర్వహించేటప్పుడు వివిధ శాఖల మాదిరిగా కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసే ఉద్యోగులకు ప్రయారిటీ ఇస్తున్న మాదిరిగా మాకు కూడా ప్రయారిటీ లేదా సంవత్సరానికి ఐదు పాయింట్లు చొప్పున వెయిటేజి కల్పించే విదంగా కృషి చేయాలని కోరారు.
గత విద్య సంవత్సరం కొంత మంది స్కూల్ అసిస్టెంట్ సి ఆర్ టి లను డిగ్రేడ్ చేస్తూ ఎస్ జి టి లుగా నియమంచి అన్యాయానికి గురి చేశారు వారిని తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా నియమించే విదంగా కృషి చేయాలని కోరారు. ప్రతి ఏడాది జెఎల్,డిఎల్ ల మాదిరిగా కంటిన్యూ రెవిన్యూవల్ చేయిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడులు టి.నూకరాజు,విశాఖ జిల్లా అధ్యక్షులు పి.రాంబాబు,ప్రాధన కార్యదర్శి టి.సత్యనారాయణ,ఎస్ మహేశ్వర రావు ఉన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Association of Contract Residential Teachers who met Araku MP
CRT state president T. Nookaraju revealed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page