కాసులు కురిపిస్తున్న పంటలు

0 10

అనంతపురం  ముచ్చట్లు:

కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లా రెండేళ్లుగా ఉద్యాన సిరులకు నిలయంగా మారింది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పండ్ల తోటల రైతులు కష్టాల నుంచి గట్టెక్కి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఆపిల్, కివీ లాంటి నాలుగైదు పంటలు మినహాయిస్తే అన్నిరకాల పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు పండిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు. 2.02 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయల వంటి ఉద్యాన తోటలు జిల్లాలో విస్తరించాయి. ఏటా సరాసరి 50 లక్షల నుంచి 52 లక్షల టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా.. తద్వారా ఏటా రూ.10 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ జరుగుతున్నట్టు ఉద్యాన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చినీ  ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, సపోటా, వక్క, చింత, రేగు, బెండ, గులాబీ, కనకాంబరం తోటల విస్తీర్ణం పరంగా అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. అరటి, మామిడి, కర్బూజా, కళింగర , మిరప, టమాటా, వంగ, ఉల్లి, బంతి తదితర తోటల సాగులో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక్కడి పండ్ల ఉత్పత్తులు ఢిల్లీలోని ప్రధాన మార్కెట్‌ అజాద్‌పూర్‌ మండీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ మార్కెట్లకూ వెళ్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో ఉద్యాన విప్లవం మొదలైంది.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Crops pouring cassava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page