చెరువులను వదలని అక్రమార్కులు

0 5

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరం జిల్లాలో ఏ చెరువులో గ్రావెల్‌ కనిపించినా అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు. అనుమతులు అక్కర్లేకుండానే ఇష్టానుసారం తవ్వేసి ఎంచక్కా కాసులు కూడేసుకుంటున్నారు. వీరికి రియల్టర్లు… కాంట్రాక్టర్లు… సహకారం అందిస్తుండటంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పోనీ అధికారులు ఏమైనా అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. వారు కూడా ‘మామ్మూలు’గానే వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతోంది సరికదా… ప్రభుత్వ ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది.  జిల్లాలో 10,436 చెరువులున్నాయి. ఇందులో దాదాపు 35 శాతానికి పైగా చెరువుల్లోఅడ్డు అదుపు లేకుండా తవ్వేస్తున్నారు. వీరి తవ్వకాల వల్ల చెరువుల మదుములు పాడైపోతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల మదుములు లోతై కొద్దిపాటి నీరు కూడా పక్కనున్న పొలాలకు వెళ్లట్లేదు. తద్వారా రైతుల భూములు బీళ్లవుతున్నాయి. మరో పక్క వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కడమే వీరి పనిగా ఉంది. జిల్లాలోని మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఆరుకు పైగా ఉండగా అందులో చాలా మట్టుకు వృద్ధి లేదు. మరో పక్క గ్రావెల్‌ మాత్రం ఏకంగా పెరిగిపోయింది. 2018–19 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 159 శా తం తవ్వకాలు పెరిగిపోయాయి.ఇది కేవలం కాంట్రాక్టర్లు చేపడుతున్న వివిధ పనులు, రియల్‌ ఎస్టేట్ల కోసం మా త్రమే! 2018–19లో 47,726 టన్నుల గ్రావెల్‌ను తవి్వతే ఈ ఏడాది ఏకంగా 1,23,704 టన్నుల గ్రావెల్‌ను తవ్వేశారు.  ‘ఓ పది లోడ్లు మాత్రమే వేసుకుంటాం సార్‌’ అని అధికారులతో ఎంచక్కా మాట్లాడి అనుమతులు తెచ్చుకునే రియల్ట ర్లు, కాంట్రాక్టర్లు ఆ తరువాత వారి విశ్వరూపం చూపెడుతున్నారు. ఏకంగా రాత్రీ పగలూ తవ్వకాలు జరుపుతునే ఉంటారు. దీంతో చెరువులు, వాగులు, వంకలూ రూపును కో ల్పోతున్నాయి.

 

- Advertisement -

చాలా చోట్ల విపరీతమయిన లోతును తవ్వేసి వదిలేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిండిపోయి అంచనా దొరకక పలువురు చిన్నారులు, యువత అందులో పడి మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో గతంలో పలు చోట్ల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రక్లర్లు తమకు కేటా యించిన పనులను చేస్తూ వాహనాలను జోరుగా నడపడం వల్ల గ్రావెల్, ఇసుక వంటివి రోడ్లపైనే పడుతున్నాయి. ఫలితంగా రోడ్లు బురదమయం కావడం లేదా ఇసుకతో నిండిపోవడం జరుగుతోంది. దీనిపై ప్రయాణించే వాహన చోదకులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజలు నడవడానికి కూడా వీలుకాని స్థితిలో ఉన్నాయి.బాడంగి మండలం డొంకినవలసలోని వేర్‌ హౌసింగ్‌ గోదాము నుంచి అటు రైల్వే స్టేషన్‌కు ఇటు అంతర్రాష్ట్ర రహదారికి అనుసంధానమైన పక్కా తారు రోడ్డు. కానీ చూడటానికి గ్రావెల్‌ రహదారిలా కనిపిస్తోంది. కారణం… ఇక్కడ గోదాముల నిర్మాణానికి సమీపంలోని అంబటి బందలో పొక్లెయినర్‌తో తవ్వకా లు జరిపిన గ్రావెల్‌ను ఈ రహదారి మీదుగా తరలిస్తున్నారు. ముందు ఓ పక్కనున్న చాకలి బందలో తవ్వి ఇప్పుడు అవతలి వైపున్న అంబటి బంద నుంచి తవ్వేస్తున్నారు. అందువల్ల ఈ రహదారి దుస్థితి ఇలా తయారైంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Illegals who do not leave the ponds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page