డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి  బీజేపీ నాయకులు నివాళులు

0 6

కామారెడ్డి  ముచ్చట్లు:

భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార  మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆని,  1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టిన ఆయన స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వీడిచిపెట్టారని,
దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుపడ్డారని, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారని. అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చి, దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ప్రారంభించారు (ఈ పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది).ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారు. ‘ఏక్ దేశ్ మే విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే తో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారన్నారు. ఆ మహనీయుని కలలను నేటి మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందని అన్నారు.
అనంతరం కార్యాలయం ఎదుట మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, నాగర్తి చంద్రారెడ్డి, విశ్వనాధుల మహేష్, డాక్టర్ వీరేశం, విపుల్, మోటూరి శ్రీకాంత్ మొదలగు వారంతా పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:BJP leaders pay tributes to Dr Shamprasad Mukherjee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page