దారి తప్పిన  జాతీయ రహదారి

0 13

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

 

 

పాలమూరు జిల్లాలో రెండు నేషనల్హైవేలను కలిపేందుకు ‘భారత్మాల’ కింద చేపట్టిన లింకు రోడ్డు నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తే సరిపోయేదానికి టీఆర్ఎస్ లీడర్ల భూముల డిమాండ్ పెంచుకునేందుకు వేరే పాయింట్కు మార్చి, 28 కిలోమీటర్లు పెంచిన్రు. తీరా ఈ 28 కిలోమీటర్ల రోడ్డులో ఫస్ట్ అలైన్మెంట్సర్వే ప్రకారం మంత్రి భార్య పేరిట ఉన్న భూమి పోతుండడంతో వెంటనే చక్రం తిప్పిన్రు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి మరోసారి అలైన్మెంట్ మార్చడంతో ఇప్పుడా రోడ్డు ఏకంగా పాలమూరు కొత్త కలెక్టరేట్కాంపౌండ్లోంచే పోతోంది. అంతేకాదు పెద్దసంఖ్యలో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయి సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. హైదరాబాద్– బెంగళూరు 44 వ నంబర్ జాతీయ రహదారి మహబూబ్నగర్ జిల్లా మీదుగా పోతోంది. నల్గొండ జిల్లా కోదాడ నుంచి మహబూబ్నగర్జిల్లా జడ్చర్ల, పాలమూరు మీదుగా నారాయణపేట జిల్లా మాగనూరు వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం ఎన్హెచ్167గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ 44, 167 జాతీయ రహదారులను కలిపేందుకు ‘భారత్మాల పరియోజన స్కీం’ కింద  కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్హైవే అథారిటీ ఆఫీసర్లు భారత్మాల సర్వే కోసం కన్సల్టెంట్ఏజెన్సీని పెట్టుకున్నారు. 44వ జాతీయ రహదారి పై గల భూత్పూర్నుంచి తాటికొండ శివారు, గాజులపల్లి, జమిస్తాపూర్నుంచి నేరుగా ధర్మాపూర్వద్ద 167 నేషనల్హైవేను కలపాలని నిర్ణయించి, సర్వే కు డిసైడ్ అయ్యారు. ఈ గ్రామాల మీదుగానైతే 8 నుంచి 9 కిలోమీటర్ల లింకు రోడ్డు కొత్తగా వేస్తే సరిపోయేది. ఎక్కువ భాగం సర్కార్భూములే ఇందులో పోతాయి. చాలా తక్కువ మొత్తంలో రైతులు భూములు కోల్పోతారు. శివారు నుంచి వెళ్తుండటంతో గ్రామాలపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కొందరు టీఆర్ఎస్ లీడర్ల భూములకు డిమాండ్కోసం 9 కిలోమీటర్ల రోడ్డును కాదని ఎన్హెచ్44పైగల అంబట్ పల్లి గ్రామం నుంచి రోడ్డును డైవర్ట్చేసి సిద్దాయిపల్లి, అమిస్తాపూర్, పాలకొండ, క్రిష్టియన్పల్లి, అల్లీపూర్, ధర్మాపూర్ మీదుగా 28 కిలోమీటర్లకు ప్లాన్ చేశారు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి సర్వే చేయించారు. దీనివల్ల చాలామంది పేద రైతుల భూములు పోతున్నాయి. ఆయా గ్రామాల్లో పెద్దసంఖ్యలో ఇండ్లతో పాటు వందల ఎకరాల భూములు పోనున్నాయి.

- Advertisement -

సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్తాయనే అంచనాలు ఉన్నాయి. లింకు రోడ్డు ఫస్ట్అలైన్మెంట్ ప్రకారం పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ భార్య శారద పేరు మీద సర్వే నం. 258లో ఎకరన్నర పొలంలోని కొంత భాగం పోతోంది. రోడ్డు అవతల ఆయనకు ఫాంహౌస్కూడా ఉంది. దీంతో ఆఫీసర్లపై ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఫలితంగా నేషనల్ హైవే, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ఆఫీసర్లు  భారత్మాల రూట్మార్చేశారు. తాజా అలైన్మెంట్ ప్రకారం  కొత్తగా సర్వే నం. 279లో రూ. 32 కోట్లు పెట్టి అన్ని హంగులతో నిర్మిస్తున్న కలెక్టరేట్ఆవరణలోంచి లింకురోడ్డును మళ్లించేశారు. దీనిపై అధికారులు ఫైనల్ సర్వే కూడా పూర్తి చేసి అనుమతులు తెచ్చుకున్నారు. ఈ రోడ్డు కంప్లీట్అయితే కలెక్టరేట్ భూమి మూడెకరాలు పోతుంది. కలెక్టరేట్ బిల్డింగ్కి రహదారి మధ్య 10 మీటర్లే మిగుల్తుంది. అన్ని జిల్లాల్లో విశాలమైన కలెక్టరేట్లు నిర్మించి.. ఇంటర్నల్ రోడ్లు, హెలిప్యాడ్లు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కానీ కొత్త రోడ్డు కారణంగా పాలమూరు కలెక్టరేట్పూర్తిగా కళ తప్పనుంది. వాహనాల రద్దీతో కలెక్టరేట్లో ప్రశాంతత గురించి మరచిపోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మహబూబ్నగర్జిల్లా కేంద్రంమీదుగా వెళ్లే 167  హైవే నుంచి భారీ వెహికల్స్టౌన్లో కి రాకుండా ఇటీవలే రూ. 100 కోట్లతో ఎస్వీఎస్హాస్పిటల్నుంచి క్రిస్టియన్పల్లి వరకు బైపాస్రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును భూత్పూర్, మహబూబ్నగర్రోడ్డుకు అనుసంధానించారు. భవిష్యత్తులో ఈ బైపాస్ను క్రిస్టియన్పల్లి, బండమీదపల్లి, పాలమూరు యూనివర్సిటీ వెనక నుంచి ధర్మాపూర్ వరకు కలపాలని నిర్ణయించారు. ఈ రోడ్డును కలిపినా 9 కిలోమీటర్లతో రెండు హైవేలు లింక్ అయ్యేవి. ఈ ఫైలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వద్ద పెండింగ్లో ఉండగానే దీనికి సమాంతరంగా భారత్మాలను తీసుకోపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags:Lost National Highway

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page