నేటి యువ‌త‌కు ఆర్ష‌ సంప‌ద అందించాలి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి

0 3

–  శ్రీ‌రామ విజ‌యోత్స‌వ సంకీర్త‌న‌ల‌తో మార్మోగిన వ‌సంత మండ‌పం
–   శ్రీ‌రామ రావ‌ణ యుద్ధం స‌ర్గ‌ల పారాయ‌ణం

తిరుమల ముచ్చట్లు:

- Advertisement -

నేడు మ‌నం మ‌ర్చి పోతున్న ఆర్ష‌ సంప‌ద‌లైన రామాయ‌ణం, మ‌హా భార‌తం, భాగ‌వ‌తం, ఉప‌నిష‌త్తులు, అష్టాద‌శ పురాణాలను యువ‌త‌కు అందించేందుకు టిటిడి ఇటువంటి  ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో మంగ‌ళ‌వారం రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.      ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారిని ధ‌ర్మ‌మే కాపాడుతుంద‌నే విష‌యం రామాయ‌ణం మ‌న‌కు తెలుపుతున్న‌ద‌న్నారు. అటువంటి ధ‌ర్మాన్ని శ్రీ‌రాముడు ఆచ‌రించ‌టం వ‌ల‌న బ‌ల‌వంతుడైన రావ‌ణుడు నాశ‌న‌మైన‌ట్లు చెప్పారు. కావున చెడుపై మంచి ఏప్పుడూ విజ‌యం సాధిస్తుంద‌ని రామాయ‌ణం ద్వారా తెలుస్తున్న‌ద‌న్నారు. ఏవిధంగానైతే దుష్ట రావ‌ణుడి సంహారం ఈ రోజు అత్య‌ద్భుతంగా పండితుల చేత యుద్ధ‌కాండ పారాయ‌ణం ద్వారా జ‌రిగిందో, అదేవిదంగా ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మ‌రి కూడా త్వ‌ర‌లో అంత‌మై పోతుంద‌నే ఆశా భావాన్ని వ్య‌క్తం చేశారు. ధ‌ర్మాన్ని ఆచ‌రించండి క‌రోనాను త‌రిమి కొటండి అనే సిద్ధాంతంతో ప్ర‌తి ఒక్క‌రు ధ‌ర్మ బ‌ద్ద‌మైన జీవ‌నాన్ని జీవిస్తూ శ్రీ‌వారి అనుగ్ర‌హ‌నికి పాత్రులు కావాల‌న్నారు.

ఇదేవిధంగా నాద‌నీరాజ‌నం వేదిపై శ్రీ భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణంలో చివ‌రి రోజు శ్రీ‌మ‌హా విష్ణువు విశ్వ‌రూప ద‌ర్శ‌నం అవిష్క‌రించి భ‌క్తుల‌కు అందిస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన అధికారులు, వేద పండితుల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు.     అంత‌కుముందు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ  కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ జూన్ 11వ తేదీ నుండి తిరుమ‌లలోని వ‌సంత మండపంలో యుద్ధ‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రావ‌ణ సంహారంలో 109 నుండి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చెసిన్న‌ట్లు  చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. మాన‌వులుగా జ‌న్మించి రాక్ష‌స భావాల‌ను పొంద‌కూడ‌ద‌న్నారు. ప్ర‌తి రోజు రావ‌ణ సంహారం శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న అష్టైశ్వ‌ర్యాలు క‌లిగి కుటుంబం అంతా సుఖ‌సంతోషాలు, ఆయురారోగ్యాల‌తో ఉంటార‌ని వివ‌రించారు. అనంత‌రం రావ‌ణ సంహారం సంద‌ర్భంగా మ‌హిళ‌లు, వేద పండితులు, అర్చ‌కులు, అధికారులు స్వామివారికి ప్ర‌త్యేక మంగ‌ళ హ‌ర‌తులు స‌మ‌ర్పించారు.

ఆక‌ట్టుకున్న సెట్టింగులు :

టిటిడి గార్డెన్ విభాగం ఆధ్వ‌ర్యంలో అశోక‌వ‌నంలో సీత‌మ్మ‌వారు, ఆంజ‌నేయ‌స్వామివారి సెట్టింగ్‌ ఏర్పాటు చేశారు. రామ‌రావ‌ణ యుద్దం సంద‌ర్భంగా హ‌నుమంత వాహ‌నంపై క‌త్తి, గ‌ధ‌, విల్లు, ఈటే వంటి పంచ ఆయుధాలు, అస్త్ర‌లు ధ‌రించిన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, అశ్వ వాహ‌నంపై ల‌క్ష్మ‌ణ‌స్వామివారు, విల్లంబుల‌తో యుద్ధం చేస్తున్న ప‌ది త‌ల‌ల రావ‌ణుడు, యుద్ధ స‌న్నివేశాలతో ప్లెక్సీలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా ప్ర‌వేశ ద్వారం ముందు విష్వ‌క్సేనుల‌వారు, ఆయుధాలు ధ‌రించిన ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.  రామ విజ‌యోత్స‌వ కీర్త‌న‌ల‌తో పుల‌కించిన స‌ప్త‌గిరులు
ప‌ద‌క‌వితా పితామ‌హుడు శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యులవారు ర‌చించినశ్రీ‌రామ విజ‌య కీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ మధుసూధ‌న‌రావు బృందం  ” అనుచు రావ‌ణుసేన ల‌టు భ్ర‌మ‌యుచు……..” ,   ”  ఎదురా ర‌ఘుప‌తికి నీ విటు రావ‌ణా ….. ” కీర్త‌న‌ల‌ను సుమ‌ధురంగా ఆల‌పించారు.  ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్ర‌య‌దాయ వాయ్యిదాల‌తో పాటు ఢ‌మ‌రం, ట‌కోరా, జాల‌ర్లు వంటి ప్ర‌త్యేక వాయిద్యాల‌తో న‌గ‌భోతుగానంతో సంకీర్త‌న‌ల‌కు సంగీతాన్ని అందించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Arsha should provide wealth to today’s youth
Evo AV Dharmareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page