పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ

0 6

హైద్రాబాద్  ముచ్చట్లు:

పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ, ప్రజలు అందరూ పాల్గొని సహకరించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్యం సక్రమ నిర్వాహణ, నూతన డ్రైనేజీల నిర్మాణం, అవసరమైన వాడలలో రోడ్ల నిర్మాణం, ప్రాణవాయువును ఇచ్చే మొక్కల పెంపకం ఇదే పట్టణ ప్రగతి లక్ష్యమన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బాన్సువాడ పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటితో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు.బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకూడదన్నారు. అపరిశుభ్రతతో దోమలు పెరిగి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందిస్తాం. మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బాన్సువాడ పట్టణంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Urban progress is an ongoing process

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page