పర్యాటక శాఖకు భారీ  రాయితీ దిశగా అడుగులు

0 5

గుంటూరు ముచ్చట్లు:

కరోనా బారిన పడి పర్యాటకులను, ఆదాయాన్ని కోల్పోయిన పర్యాటకశాఖ రాయితీలతో జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం పర్యాటకాభివృద్ధి సంస్థ అధ్వర్యరలోని హౌటళ్లలో భారీ రాయితీలను ప్రకటించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇరదులో సాధారణ పర్యాటకులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు, పర్యాటక శాఖలో పనిచేసే ఉద్యోగులకు కూడా రాయితీలను ప్రతిపాదించింది. ప్రభుత్వ ఆమోదం లభిరచిన వెంటనే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక హౌటళ్లలో 40 నుంచి 70 శాతం వరకు ప్రతి రోజూ పర్యాటకులు ఉంటున్నారు. ప్రధానంగా విశాఖ జిల్లా రుషికొరడ, కృష్ణా జిల్లా విజయవాడలోని బెరం పార్క్‌, పర్యాటక హౌటల్లో 76 శాతం, సూర్యలంక బీచ్‌, కాకినాడ దగ్గర దిడి, తిరుపతి, మహానంది, అహౌబిలం, శ్రీశైలంలోని హరిత రిసార్ట్స్‌ల్లో 60 నురచి 77 శాతం వరకు ఆక్యుపేషన్‌ ఉండేది. ఇదే సమయంలో విశాఖ నగరం, త్యాడ, అనంతగిరి, అరకు, విజయవాడలోని భవానీ ద్వీపం, నెల్లూరు జిల్లా మైపాడు, రామాయపట్నం, హార్సిలీహిల్స్‌, కడప జిల్లాలోని గండి, గండికోటల్లోని హౌటళ్లు కూడా ఏభై శాతానికన్నా ఎక్కువగానే ఆక్యుపెన్సీ ఉన్నట్లు తేలిరది. మరో పధ్నాలుగు ప్రాంతాల్లో 40 నురచి 50 శాతం వరకు పర్యాటకుల తాకిడి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రావడం, పర్యాటక స్థలాలు కూడా మూత పడడంతో పర్యాటక రంగం దెబ్బతింది.ఈ నేపధ్యంలోనే కొత్త ప్రతిపాదనలకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. ఇరదులో భాగంగానే అన్ని రకాల గదుల్లో సాధారణ పర్యాటకులు, సందర్శకులు, ప్రజలకు 35 శాతం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వ రరగ సంస్థల్లో పనిచేసే వారికి 50 శాతం రాయితీతోపాటు పర్యాటకశాఖలో పనిచేస్తున్న, పదవీ విరమణ చేససిన వారికి కూడా 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రాయితీలను ఆరు నెలలపాటు కొనసాగించాలని ప్రతిపాదించారు. దీనివల్ల పూర్తిగా పడిపోయిన ఆదాయాన్ని కొంతవరకైనా పెంచుకునేందుకు అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Steps towards huge discount for tourism department

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page