పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

0 18

న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. దీంట్లో భాగగా ఏపీకి చెందిన బీజేపీ నేత మాజీ లోక్ సభ సభ్యుడు  కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. కంభంపాటి హరిబాబు … గత 2014 సార్వత్రిక ఎన్నికలలో  భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచారు. హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన జై ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఆయన తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్య నాయుడులతో కలిసి పాల్గొన్నారు.తనకు గవర్పర్ గా అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ , ప్రధాని మోదీలకు  హరిబాబు అభినందనలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం రాష్ట్రంపై సమకాలిన అంశాలు, ప్రత్యేక పరిస్ధితులపై అవగాహన చేసుకోని ఆ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:New governor for several states
Kambhapati Haribabu as the Governor of Mizoram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page