పీలేరు భూ ఆక్రమణల పై స్పందిందించిన సబ్ కలెక్టర్ జహ్నావి

0 25

-అక్రమ లేఔట్ల పైఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. పోలీసు కేసునమోదు చేస్తాం…

 

చిత్తూరు ముచ్చట్లు:

 

- Advertisement -

చిత్తూరు జిల్లా పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కొండలు, గుట్టలు, బండలు లెవల్ చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ లే అవుట్లు వేసి అమ్మకానికి ఉంచారని, సుమారు400కోట్లు విలువ చేసేప్రభుత్వ భూములు కొంతమంది స్వాధీనం చేసుకున్నారని,జాతీయ రహదారుల పక్కనే కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలియ జేశారు.దీని మీద గత వారం నుండి పాలక పక్షం, ప్రతిపక్షం అవాక్కులు చివాక్కులు పేలుతున్నాయి.సబ్ కలెక్టర్ జాహ్నవి స్పందించి, పీలేరు పరిసరాల్లో,ముడుపుల వేముల గ్రామం, తిరుపతి రోడ్డు మార్గం లో వేసిన లే ఔట్ల పై ఆరా తీశారు.పీలేరు తహసీల్దార్ పుల్లా రెడ్డి, సర్వేరు ను అడిగి తెలుసుకొన్నారు,వారు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములుఆక్రమించుకున్న,  అక్రమ లే ఔట్ల వేసిన,ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేస్తామని అన్నారు.ఎక్కడెక్కడ అయితే ప్రభుత్వ భూములున్నాయో అక్కడ బోర్డులు నాటి సూచికలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ పుల్లారెడ్డిని కోరారు, అంతే కాకుండా పట్టణ,మరియు, గ్రామీణ ప్రజలకు అనవసరంగా రియలర్ల మాటవిని,ప్రభుత్వ,డి కే టిభూములు కొని మోస పోవద్దని అవసరమైతే తహశీల్దార్ ను సంప్రదించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో రెవెన్యు అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Sub-collector Jahnavi responding to Peeru land grabs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page