పుంగనూరులో టాటాఏసీ వాహనాన్ని ఢీకొన్న లారీ-12 మందికి గాయాలు

0 686

-నలుగురి పరిస్థితి విషమం

 

 

పుంగనూరు ముచ్చట్లు:

 

 

- Advertisement -

కర్నాటక నుంచి శ్రీబోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న ఆటోను అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో 12 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా మారిన సంఘటన మంగళవారం పుంగనూరు సమీపంలోని చదళ్ల క్రాస్‌ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం చింతామణి తాలూక నాగిదేనిహళ్ళిగ్రామానికి చెందిన శ్రీనివాసులు(52), శరత్‌(13), లక్ష్మినారాయణరెడ్డి,(40) , మంజునాథ్‌(45) , ఓబులమ్మ(30), మునిరామిరెడ్డి (60), శివరాజు((25),కె.నారాయణస్వామి(60), ఎం.నారాయణస్వామి(50), భాస్కర్‌(30), కెఎం.శ్రీరాములురెడ్డి(42),బైరేష్‌ లు కలసి చౌడేపల్లె వద్ద గల బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో చదళ్లమిట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ టాటఏసి వాహనాన్ని ఢీకొంది.ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసులు(52), శరత్‌(13), లక్ష్మినారాయణరెడ్డి,(40) , మంజునాథ్‌(45)లను కోలారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కలసి బాధితులకు వైద్యసేవలు అందించారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కూడ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags; Lorry-12 injured in collision with TataAC vehicle in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page