బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో ముందుకు సాగాలి

0 7

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ పిలుపు
కోరుట్లలో జగ్జీవన్ రామ్ 35 వ వర్థంతి సభ

కోరుట్ల  ముచ్చట్లు:
భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది, బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరు  భాగస్వామ్యం అయి ముందుకు సాగాలని తెలంగాణ  ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ పిలుపు నిచ్చారు. మంగళవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన 35 వ వర్థంతి సభ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పేట భాస్కర్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్  సేవలకు గుర్తుగా పట్టణంలో ఆయన పేరిట నిర్మిస్తున్న జగ్జీవన్ పార్క్ వచ్చే జయంతోత్సవాల వరకు సుందరంగా తీర్చిదిద్దాలని స్థానిక మున్సిపల్ పాలక పక్షాన్ని ఈ సందర్భంగా కోరారు. దేశంలో అనేక సంస్కరణలకు మూలకారకుడైన బాబు జగ్జీవన్ రామ్ సేవలను బడుగు, బలహీన వర్గాల ప్రజలు, నాయకులు ముందుకు తీసుకెళ్ళాలని స్పష్టం చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Babu Jagjivan Ram should move forward in the pursuit of his aspirations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page