బాలానగర్ బ్రిడ్జ్ ప్రారంభం

0 11

బాబు జగ్జీవన్ రామ్ పేరును ఖరారే జేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్  ముచ్చట్లు:
అంత్యంత దుర్భరమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న బాలాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు నేటి నుండి చెక్‌పడింది.  ఈ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్డీపీ నిధులచేత హెచ్ఎండీఏ ప్రారంభించి మొత్తం సుమారు నాలుగు సంవత్సరాల సమయంలో పూర్తి చేశారు. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మిం చారు.  బ్రిడ్జి ప్రారోంభత్సం అనంతరం మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ…ఎస్ఆర్డీపీ క్రింద నగరంలో మొత్తం 30 వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు..కాగా ఇందులో ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గంలో వేయి కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నడుం బిగించారని అందులో భాగంగానే ఎస్ఆర్డీపీ నిధుల క్రింద ప్రాజేక్టులు చేపట్టామని వివరించారు.
ఇక నేడు ప్రారంభించిన ఫ్లైఓవర్‌కు బాబు జగ్జీవన్‌రాం పేరును పెట్టబోతున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. మరోవైపు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటిఆర్ రిబ్బన్ కటింగ్ చేయకుండా…సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగస్వాములు అయిన కార్మికులను గౌరవించుకునేందుకు గాను గత నాలుగు సంవత్సరాలుగా వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేత రిబ్బన్ కట్ చేయించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్న గౌరవమని వ్యాఖ్యానించారు. మరోవైపు నగరంలో పాట్నీ నుండి తూంకుంట వరకు మరోవైపు సుచిత్ర చౌరస్తావరకు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా…కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణాలు ఆగాయని తెలిపారు. కేంద్రం నుండి నిర్మాణాలు వచ్చిన వెంటనే సుచిత్ర తోపాటు రెండు స్కై ఓవర్లు నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Opening of Balanagar Bridge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page