ముఖ్యమంత్రి ప్రసాదం జగనన్న ఇళ్ళు…ఎమ్మెల్యే భూమన

0 5

తిరుపతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి ప్రసాదం జగనన్న ఇళ్ళని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లి వద్ద మంగళవారం జగనన్న ఇళ్ళ స్థలాలకు జియో ట్యాగింగ్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి ఎం.పి.గురుమూర్తి,తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా,కమిషనర్ గిరీష, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,ఎమ్మార్వో వెంకటరమణ,ఎం.పి.డి.ఓ రాధమ్మ,సర్పంచ్ భారతీలు పూజలు నిర్వహించి జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇళ్ళులేని పేదవారికి స్థలమిచ్చి సొంతింటి నిర్మాణం చేయించి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెలుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మనమంతా కృతజ్ఞతలు తెలపాలన్నారు.తిరుపతిలోని వేలాదిమంది గూడులేని ప్రజలకి ఆహ్లాదకరమైన కొండల చెంత ఇళ్ళస్థలాలు ఇచ్చి సొంతింటి నిర్మాణం కట్టించి అద్దెదారుడ్ని సొంతింటి యాజమాని చేయిస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.కులాలకు,మతాలకు,వర్గాలకు,రాజకీయాలకు అతీతంగ ఇళ్ళులేని ప్రతి పేదమహిళను సొంతింటికి యాజమాని చేయాడమే జగనన్న ధ్యేయమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు.

 

- Advertisement -

తిరుపతి ఎం.పి డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ పేదల గుండె చప్పుడు స్పష్టంగా విన్నారు కాబట్టే పేద ప్రజల పక్షపాతిగా నిలుస్తూ ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారన్నారు.ఏదో కొద్దిమందికే ఇచ్చామని కాకుండ ఊర్లకు ఊర్లనే పేదప్రజలాకు సొంతస్థలంలో సొంత ఇళ్ళు ఇవ్వాలనే దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఎం.పి.గురుమూర్తి పేర్కొన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ ప్రకృతి వాతావరణంలో సొంతింటి నిర్మించి ఇవ్వడమే కాకుండా ఇక్కడ నివాసం వుండబోయేవారికి అవసరమైన అండర్ డ్రైనేజీ సిస్టమ్,అండర్ కరెంట్ కేబుల్ వర్కుతోబాటు,త్రాగునీరు,రోడ్లను ఏర్పరిచి ఇవ్వడం జరుగుతుందన్నారు.రాష్ట్రాభివృద్ధికి నిరంతరం ఆలోచిస్తూ శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కమిషనర్ గిరీషా ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ తిరుపతిలోని ఇళ్ళులేని అర్హులైన 8148 పేదలకు రెండు వందల ఎకరాల్లో ఇళ్ళస్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని,ఇళ్ళ స్థలాల విషయంలో ఎలాంటి అవంతరాలు వచ్చిన తమని కలిస్తే సమస్యని వెంటనే పరిష్కరిస్తామన్నారు.వైసిపి జిల్లా యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లి దగ్గర ఏర్పడుతున్న ఈ జగనన్న ఊరికి కావల్సిన సదుపాయాలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెరవేరుస్తారని హామీ ఇచ్చారు.డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ తిరుపతిలోని సొంతింటి కలను తీర్చి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ముఖ్యమంత్రికి మనమంతా ఋణపడి వుండాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్.కె.బాబు,ఆంజినేయులు,నరేంధ్ర,అనీల్,శైలజా,కల్పన,కుమారి,రేవతి,కో.ఆప్సన్ మెంబర్లు ఇమామ్,శ్రీదేవి,రాజేశ్వరీ,ఎం.పి.పి‌ హేమాద్రీ,ఎం.పి.టి.సి సులోచన,అధికారులు ఎస్.ఈ మోహన్,ఎం.ఈ వెంకట్రామిరెడ్డి,డిఈలు విజయ్ కుమార్ రెడ్డి,సంజీవ్ కుమార్,ఆర్వోలు సేతుమాధవ్,సుధాకర్,డి.ఎస్.ఓ నీలకంఠం,కాటమరాజు,శ్రీరాములు,రమణలు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Chief Minister Prasad Jagannath’s house … MLA Bhumana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page