విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ అడ్డగింత

0 24

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి
విద్యాశాఖ మంత్రికి విద్యార్థి, యువజన సంఘాల నిరసన సెగ
అనంతపురం  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మంగళవారం నాడు అనంతపురము జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి పర్యటనను అడ్డగించి తమ నిరసన తెలియజేసిన విద్యార్థి,యువజన సంఘాల నాయకులు,ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మనోహర్, ఎస్ఎఫ్ఐ సూర్య చంద్ర, డివైఎఫ్ఐ రమేష్, ఎన్ ఎస్ యు ఐ పులి రాజు, పిడిఎస్ యు వీరేంద్ర మాట్లాడుతూ తక్షణం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగతను నిర్మూలిస్తామని, కరువు జిల్లాలో వలసలను నివారిస్తామని గొప్పలు పలకి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన అనంతరం నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారన్నారు, ఇప్పటికే దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు,విద్యార్థి, యువజన సంఘాలు ఆవేదనతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కనీసమైన చలనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం చాలా బాధాకరం అన్నారు, ఉద్యమాలు చేసే వారి పైన ప్రశ్నించే తత్వాన్ని  అణచి వేయాలనే ధోరణితో ప్రజాస్వామ్యా స్వేచ్ఛను కూని చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఆలోచించి ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్, ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉమా మహేష్,వంశీ తదితరులు పాల్గొన్నారు

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Education Minister Adimulku Suresh Convoy intercepted

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page