సాగు నీటి ప్రాజెక్టులకు పకడ్బందీ

0 17

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణలో ప్రాజెక్టులను ప్రగతిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. అయితే.. గత ప్రాజెక్టుల మరమ్మతులు చేయించక పోవడంతో సాగు నీటి సరఫరాకు అంతరాయం కలిగి సాగు లక్ష్యం దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా పనిలో ఉండాలని ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ శాఖను ఇరిగేషన్‌లో అంతర్భాగంగా ఏర్పాటు చేసి ప్రాజెక్టుల పర్యవేక్షణ చేపడుతుంది.జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జిల్లాకే మణిహారమైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు, అందులో అంతర్భాగమైన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ), కరువు నేలను సస్యశ్యామలం చేసే డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌తోపాటు ఆసిఫ్‌ నెహర్‌ కాల్వ మరమ్మతుల కోసం మొత్తంగా 7.59కోట్లు మంజూరు చేసింది.

 

- Advertisement -

ఇందుకు గాను ఆయా ప్రాజెక్టుల పరిధిలో డీఈలు రూ.2లక్షల వరకు, ఈఈలు రూ.5లక్షలు, ఎస్‌ఈలు రూ.10 లక్షలు, సీఈలు రూ.2 కోట్లు, ఈఎన్‌సీ రూ.5కోట్ల వరకు పనులను బట్టి టెండర్లు పిలిచేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం 28 రకాల పనులను గుర్తించిన యంత్రాంగం వాటికి నేడో రేపో ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి మూడు నెలల్లో మరమ్మతులు చేయించనున్నారు.జిల్లాలోని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాల్సి వస్తే గతంలో ప్రభుత్వానికి నివేదించి సంబంధిత సీఈ ఆదేశాలతో పనులు చేపట్టేవారు. దీంతో ప్రాజెక్టుల్లో మరమ్మతులు చేయడానికి ఒక్కోసారి నెలల సమయం పట్టేది. కాలానుగుణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాటి పరిధిలోని ఆయకట్టుకు కొన్నిసార్లు నీళ్లు అందేది కాదు. దీన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో ఈఎన్‌సీ పోస్టు క్రియేట్‌ చేసిన సర్కార్‌.. కింది స్థాయిలో సీఈలను ఏర్పాటు చేసింది. వారి ద్వారా ఇరిగేషన్‌ సీఈలు, ఎస్‌ఈలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టులను నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. అంటే ప్రతి ఏటా ఏ ప్రాజెక్టుకు అయినా మరమ్మతు చేయాల్సి వస్తే వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయించవచ్చు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Armor for irrigation water projects

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page