స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో వేతనాలను వెంటనే అందజేయాలి… సీపీఎం

0 6

తుగ్గలి ముచ్చట్లు:
గత సంవత్సర కాలంగా స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో వేతనాలను వెంటనే అందజేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.తుగ్గలి మండల పరిధిలోని ఉప్పర్ల పల్లి గ్రామంలో జి.సుంకన్న, బి.ఆంజనేయులు,జి.చిన్న రాముడు లు గత సంవత్సర కాలంగా పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహించారు.అయితే మాకు గత ఏడాది కాలం పాటు వేతనాలు ఇంతవరకు మంజూరు కాలేదని,అధికారులు అసలు వేతనాల సంగతిని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వేతనాలు ఇవ్వకుండా విధులలో నుంచి కూడా తొలగించి కొత్త వారిని విధుల్లోకి తీసుకున్నారని,ఇప్పుడు మేము పనిచేసిన చోట వేరొకరు వచ్చి పని చేస్తున్నారని వారు తెలియజేశారు.ఎంతో కష్టపడి చెమటోడ్చి పనిచేసిన మాకు ఏడాది కాలమైనా మాకు వేతనాలుఅందించ లేకపోయారని,ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఇటు చేసేందుకు పనిలేక,చేసిన పనికి వేతనాలు రాక మాకుటుంబ పోషణ అద్వాన్నంగా మారిపోయిందని,అసలే చాలీచాలని వేతనాలతో ఎలాగోలా కుటుంబాన్ని ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్నామని,పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోషణ మరింత భారంగా మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని,కావున మీరు మా సమస్యలపై స్పందించి సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు రావాల్సిన ఏడాది కాలం వేతనాలు విడుదల చేయించి ఇప్పించేందుకు కృషి చేయాలని ఉప్పర్ల పల్లి గ్రామ విఆర్ఓ వెంకన్న కు వారు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం రోజున వినతిపత్రాన్ని అందజేశారు.గ్రామంలో ఎలాంటి స్థిరచరాస్థులు లేవని, కావున పెండింగ్లో ఉన్న తమ జీవితాలను తమకు అందచేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీరాములు,స్వచ్ఛ భారత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Swachhbharat workers should be paid their pending wages immediately …
CPM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page