హెచ్సీయేకు ఎన్నికలు జరపాలి

0 7

హైదరాబాద్  ముచ్చట్లు:

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు  80 ఏళ్ల చరిత్ర ఉంది.  ఇప్పుడు అది నాశనం అయిపోతుంది.   దాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది.  హెచ్.సి.ఏ. లో 218 క్లబ్బులు ఉన్నాయి. అందులో ఉన్న వారికి ఎప్పుడు మనస్పర్థలు ఉంటాయి.  ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా అవ్వడంతో మరింత పెరిగిందని  హెచ్ సి ఏ మాజీ అధ్యక్షుడు  జి.వినోద్ అన్నారు.  గతంలో ఐసీసీ చాంపియన్ షిప్ కోసం నేను, మా నాన్న బాగా కృషి చేసాము.  నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అందరిని కూర్చోబెట్టి పరిస్థితులను చక్కబెట్టినా.  రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు హెచ్.సి.ఏ. కి 5 ఎకరాల ల్యాండ్ ఇప్పించాను.  స్టేడియం నిర్మాణానికి 4.5 కోట్లు ఇచ్చాం.  క్రికెట్ అభివృద్ధి కోసం… మేము ఎప్పుడు ముందుంటాము.  ప్రస్తుతం హెచ్.సి.ఏ.లో జరిగే పరిమణాలను చూస్తుంటే… బాధేస్తుంది.  జింఖాన గ్రౌండ్ ని నిన్న మూసేసారు. అలా ఎలా ముస్తారు.?  హెచ్.సి.ఏ. లో చిల్లర లొల్లులు పోవాలంటే… మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సిందే.   అజార్, అపెక్స్ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుకోవాలి లేదా ఉన్న బాడీలు డిజల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి.  ఇటీవల జరిగి ఏ.జి.ఎమ్. పై… ఎవరికి క్లారిటీ లేదు.  అజార్ చెప్పింది ఒకలా ఉంది. జాన్ మనోజ్ చెప్పేది మరోలా ఉంది.   అందరూ కూర్చొని సమస్యల్ని పరిష్కరించుకుంటే… హెచ్.సి.ఏ. చాలా లాభం ఉంటది.  ఇప్పుడున్న కార్యవర్గం సెలెక్షన్ కమిటీల్లో తమ మనుషులనే పెట్టుకుంటున్నారు.  నేను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అలా లేకుండే.  ప్రెసిడెంట్ అజార్… నాకే అన్ని తెలుసు అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. అందరిని కలుపుకుంటు వెళ్ళాలి.  ఇక అజార్ పై వస్తున్న విమర్శలపై ఆయనే స్పందించాలి. నేనూ ఏమి మాట్లాడలేను.  ఏ.సి.బి కేస్ లలో చాలా మంది ఉన్నారు. కోర్ట్ లో ప్రొసీడింగ్ నడుస్తుంది. అలాంటి సమయంలో మనం ఏమి మాట్లాడలేమని అన్నారు.
జడ్జ్ మెంట్ వచ్చాకే మాట్లాడుతాను.  అజార్ హైదరాబాద్ క్రికెట్ ఇప్పటివరకు ఏం చేశాడు.  అపెక్స్ కౌన్సిల్, ప్రెసిడెంట్ కి కో-ఆపరేషన్ లేనప్పుడు గొడవలు జరిగుతూనే ఉంటాయి.  రిటైర్డ్ జడ్జ్ తో ప్రత్యేక సరవసభ్య సమావేశం నిర్వహించి… బాడీ ని ప్రొటెక్ట్ చెయ్యాలి.  హెచ్.సి.ఏ. క్లబ్ మెంబర్లకు 50 ఎకరాల్లో ఇల్లు కట్టిద్దం అనుకున్న. కానీ అలా జరగలేదు.   ఇక హైదరాబాద్ కి మ్యాచ్ లు రావట్లేదు. కారణం హెచ్.సి.ఏ.లో బీసీసీఐ తో సరిగ్గా మాట్లాడేవాళ్ళు లేరు.   దేశంలోనే మన గ్రౌండ్ అత్యుత్తమమైనదని అయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Elections must be held for the HCA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page