29 వేల లీటర్ల మద్యం  ఎలుకలు పాలు

0 16

పాట్నా ముచ్చట్లు:

 

ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాళీచేసిన ఘటన తమిళనాడులో తాజాగా వెలుగుచూసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో మద్యం దుకాణాలను మూసివేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను తెరిచారు. ఓ దుకాణంలో 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్‌ తిన్నారు. నీలగిరి జిల్లా గుడలూరు సమీపంలోని కదంపూజ పట్టణంలో మద్యం దుకాణాన్ని లాక్‌డౌన్ కారణంగా మూసివేశారు.లాక్‌డౌన్ ఎత్తివేయడంతో 56 రోజుల తర్వాత తిరిగి ఈ దుకాణాన్ని తెరవగా.. అందులో ఖాళీ బాటిళ్లు చూసి ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండగా.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎలుకలు మద్యం తాగిన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.‘‘బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయి..

 

 

- Advertisement -

ఆశ్చర్యకరంగా కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయి.. బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదు’’ అని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఎలుకలు ఖాళీచేసిన క్వార్టర్ బాటిల్ ఖరీదు రూ.1,400 అని తెలిపారు. ఎక్కువ రోజులు దుకాణం మూసివేసి ఉంచడం వల్ల ఎలుకలు ఆవాసంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. దుకాణం తెరిచిన తర్వాత శానిటైజేషన్ చేశామని, ఎలుకలన్నీ బయటకు వెళ్లిపోయాయన్నారు.ఇటీవల 29 వేల లీటర్ల లిక్కర్‌ను ఎలుకలు తాగేశాయని బిహార్ పోలీసులు చెప్పడం దేశం విస్తుపోయిన విషయం తెలిసిందే. తనిఖీల సమయంలో పట్టుబడిన 50 వేల లీటర్ల నాటు సారా, 30 వేల లీటర్ల మద్యం, 3 వేల క్యాన్ల బీర్‌‌ను పోలీస్ట్ స్టేషన్లలో భద్రపరిచారు. అందులోని 29 వేల లీటర్ల మద్యం మాయం కావడంతో దానిని ఎలుకలు తాగేశాయని చెప్పడంతో చర్చనీయాంశమయ్యింది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Milk rats 29 thousand liters of alcohol

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page