45 రోజుల్లో పుష్ప మూవీ పూర్తి

0 4

హైదరాబాద్  ముచ్చట్లు:

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ గెటప్‌లో అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న ఆయన.. లారీ డ్రైవర్పు రాజ్‌గా మునుపెన్నడూ కనిపించని లుక్‌లో వెండితెరపై కనిపించబోతున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా షూటింగ్ స్టార్ చేయాలని ప్లాన్ చేయగా కొన్ని అనుకోని కారణాలతో మరోసారి షూటింగ్ వాయిదా వేశారని విన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా అలాంటి రూమర్స్‌కి చెక్ పెడుతూ రంగంలోకి దిగారు అల్లు అర్జున్.లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ‘పుష్ప’ సినిమా షూటింగ్ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై ప్రస్తుతం సికింద్రాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నారు.

 

 

- Advertisement -

ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరిందని, మరో 45 రోజుల్లో ‘పుష్ప’ మొదటి భాగానికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని చిత్ర యూనిట్ అంటోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది.ఇకపోతే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు సుకుమార్. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: he floral movie is complete in 45 days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page