అధికారులపై ఎమ్మెల్యే చిరుమర్తి ఆగ్రహం

0 8

జాతీయ రహదారి 65 పై పెండింగ్  మస్యలను పట్టించుకోవట్లేదంటూ మండిపాటు
వారంలోపు సమస్యలను పూర్తి చేయకపోతే పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దిగ్బంధం తప్పదంటూ హెచ్చరిక
నకిరేకల్  ముచ్చట్లు:
జాతీయ రహదారుల అధారిటీ, జీఎంఆర్ అధికారులపై నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య  ఆగ్రహం వ్యక్తంచేశారు, బుధవారం నాడు చిట్యాల మున్సిపాలిటీలోని 3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు ఆయన మొక్కలను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డును పారిశుద్ధ్య లోపంలేకుండా తీర్చిదిద్దడానికి ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు, ఇంకా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పై పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అనేకసార్లు జాతీయ రహదారుల అధారిటీ, జీఎంఆర్ ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోవట్లేదంటూ వారిపై మండిపడ్డారు,వారంలోపు నకిరేకల్ నియోజకవర్గంలోని గుండ్రంపల్లి గ్రామం నుండి కేతేపల్లి మండలం వరకు హైవే పై పేరుకుపోయిన సమస్యలను పూర్తి చేయకపోతే నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్బంధం చేస్తారంటూ హెచ్చరించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:MLA Chirumarthi is angry with the authorities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page