ఇంటర్ మార్కులపై  నిర్ణయం

0 20

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్‌ పరీక్షా ఫలితాల ప్రాతిపదికను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ మార్కులపై కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు మార్కుల మెమోలను జారీ చేస్తామని తెలిపారు.ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని అన్నారు
ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాల కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంస్థ కార్యదర్శి ఎంఆర్ ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags:Decision on Inter Marks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page