నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర నీడలు

0 8

బోధన్ ముచ్చట్లు:

సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకాలపాలకు పాల్పడి ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవిస్తున్న యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి పరారి అయిన ఘటన కలకలం రేపింది. దీనిపై సౌదీ ప్రభుత్వం ఆరా తీయగా సదరు యువకుడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రెంజల్ బేస్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి   సౌదీ అరేబియా ప్రభుత్వం అందించింది. దీంతో హైదరాబాద్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు సంబంధించిన ఓ డీఎస్పీ, ఇద్ధరు సీఐల  బృందం సదరు యువకుడిని బోధన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.   ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
నిజామాబాద్ జిల్లాలో ఐఎస్ఐ మూలాలు, ఈ ఏడాది ప్రథమార్ధంలో రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇప్పించిన ఘనతతో పాటు బోధన్‌లో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న యువకుడిని ఇంటెలిజెన్స్ సెల్ వారు పట్టుకుపోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.  బోధన్ రెంజల్ బేస్‌కు చెందిన కుటుంబంలో ముగ్గురు సోదరులుండగా, అందులో ఒక యువకుడు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాడు.  అక్కడే ఉపాధి పొందుతున్న సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని అక్కడి ప్రభుత్వం గుర్తించి యువకుడిని అరెస్టు చేసి జైలులో వేసింది.  శిక్ష అనుభవించిన సదరు యువకుడు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఎవరికీ కనిపించకుండా పోయాడు.  దానితో అక్కడి నిఘా వర్గాలు అరా తీయ్యడంతో సదరు యువకుడు సౌదీ అరేబియాను వదిలి వెళ్లిన విషయం తెలియడంతో ఇండియాకు చెందిన ఇంటలిజెన్స్ సెల్ అధికారులకు సమాచారం అందించారు.  నిజామాబాద్ సీపీకి ముందస్తుగా సమాచారం అందటంతో ఆ వ్యక్తిని అదపులోకి తీసుకున్నట్లు సమాచారం.  రెండవ విడత లాక్ డౌన్ ఎత్తివేత సమయంలో ఈ ఘటన జరిగినా ఇక్కడి నిఘా వర్గాలు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.  అసలు రేంజల్ బేస్‌లో సైతం ఫలానా యువకుడు సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొని అక్కడ జైలు శిక్ష అనుభవించిన విషయం, పరారీ విషయం అతని కుటుంబ సభ్యులు కుడా రహస్యంగా ఉంచారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Furious shadows in Nizamabad district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page