నిర్వాసితుల సమస్యలపై ఒక్కరోజు దీక్ష..

0 4

కుక్కునూరు  ముచ్చట్లు:
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట
పోలవరం నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష నాయకులు ఒక్క రోజు దీక్ష చేపట్టారు.ఈ దీక్షకు సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మద్దతు తెలిపారు.ఈ దీక్షలో అఖిల పక్ష నాయకులు యర్రం శెట్టి నాగేందర్  మాట్లాడుతూ,ముంచుకొస్తున్న గోదావరి వరదల కారణంగా అధికారులు నిర్వాసితులకు త్వరగా వారికి రావాల్సిన ప్యాకేజి ఇచ్చి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం మొత్తం అఖిలపక్ష నాయకులు నిర్వాసితుల తరపున పోరాడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని అన్నారు.కుక్కునూరు మండలంలో మొదటి విడతలో తరలించే గ్రామాలు కాకుండా, ఇంకా అనేక గ్రామాలు వరదలకు గురౌతున్నాయని వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పరిహారం ఇవ్వాలని అన్నారు.గత సంవత్సరం వరదలకు అనేక గ్రామాలు మునిగాయి.ఇప్పుడు వచ్చే వరదలు ఎక్కువగానే ఉంటాయని అధికారులు తెలియ చేస్తున్నారు.అలాంటప్పుడు అధికారులు మిగతా గ్రామాలపై కూడా దృష్టి పెట్టి నిర్వాసితులకు అందరికి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కూరకుల బాబూరావు,వరుస నాగేశ్వరరావు,పాపారావు,పిచ్చుక రాజు,విరచారి,కొన్నే లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:One day initiation on the problems of the displaced ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page