పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు స్వయం అభివృద్ధి  ,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0 13

ఖమ్మంముచ్చట్లు:

సీఎం కేసీర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి తలమానికంగా తయారవుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతూ, గ్రామాలు స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ప్రతి గ్రామ పంచాయతికి ప్రభుత్వం నేరుగా నెల, నెల నిధులు అందిస్తుందని పేర్కొన్నారు. గతంలో గ్రామంలో మౌలిక వసతికి లక్ష రూపాయలు కావాలంటే మంత్రులను కలిసి కోరిన సందర్భాలు ఉండేవన్నారు. కానీ నేడు సీఎం కేసిఆర్ అడగకుండానే గ్రామాలకు పల్లె ప్రగతి కోసం రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రతి నెల 369 కోట్ల రూపాయలను నేరుగా ఇస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అభివృద్ధి పనులను అమలు చేస్తున్న సీఎం లేరన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దళితవాడలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Villages self-development through rural progress
Transport Minister Puwada Ajay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page