పుంగనూరు ప్రభుత్వాసుపత్రికిషాక్‌ ట్రీట్‌మెంట్‌ -ఇద్దరు నర్సులు సరండర్‌

0 579

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పేద రోగులకు వైద్య సేవలు అందించాల్సిన నర్సులు రాజకీయాలు చేస్తూ, ధర్నా, గొడవలు సృష్టించడం, వైద్యులపై తిరుగుబాటు చేసి, వైద్యసేవలకు అంతరాయం కలిగించడంతో ఇద్దరు నర్సులను అమరావతిలోని వైద్యవిదానపరిషత్‌కు సరండర్‌ చేస్తూ జిల్లా కలె క్టర్‌ హరినారాయణ్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంఘటన పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆసుపత్రిలో హెడ్‌నర్సులుగా పని చేస్తున్న మధుబాల, పద్మావతి లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిలపై తిరుగుబాటు చేయడం, అసత్య ఆరోపణలతో పిటిషన్లు పెట్టుకోవడం చేశారు. అంతటితో ఆగకుండ ఆసుపత్రిలోకి బయటవారిని తీసుకొచ్చి, అల్లర్లు, ధర్నాలు చేయించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పుల్‌స్టాప్‌ పెట్టి, పేద ప్రజలకు వైద్యసేవలు అందించాలని మంత్రి కృతనిశ్చయంతో జిల్లాకలెక్టర్‌కు ఆసుపత్రిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇద్దరు నర్సులకు వైద్యశాఖలో పని చేస్తున్న ఒక జిల్లా అధికారి మద్దతు ఇవ్వడంతో నర్సులు బాధ్యత లేకుండ ప్రవర్తిస్తున్నారని , డాక్టర్లు, నర్సులు విచారణలో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అలాగే మరో ఇద్దరు నర్సులు ఆసుపత్రిలో బాలింతల వద్ద డబ్బులు వసూలు చేయడం, చీటీలు వేసి వడ్డీల వ్యాపారం చేయడంపై కూడ కలెక్టర్‌కు నివేదికలు అందింది. ఇందులో భాగంగా మధుబాల, పద్మావతి హెడ్‌నర్సులపై వేటు వేశారు. వీరిద్దరిని ప్రభుత్వానికి సరండర్‌ చేశారు. మరో ఇద్దరు నర్సులపై కూడ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల ఇద్దరు నర్సులను రిలీవ్‌ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Punganur Prabhutvasupatrikishak Treatment – Two nurses surrender

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page