ప్రేమించిన యువతిని నిర్బంధించిన ప్రియుడు

0 13

ఏలూరు  ముచ్చట్లు:
మాజీ ప్రియురాలిని ఇంట్లో బంధించిన వైనం ఇది.  పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరులో జరిగింది. నవుడూరుకు చెందిన రమేష్, బెంగుళూరు కు చెందిన యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే రమేష్ ఇటివల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి బెంగుళూరు నుండి రమేష్ ఇంటికిఆ  ప్రియురాలు వచ్చింది. రమేష్  ఆమెను  ఇంట్లో నిర్బంధించి బెదిరింపులకు గురిచేసాడు. దీనికి అతని తల్లిదండ్రులు, స్నేహితులు కుడా తోడయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న  వీరవాసరం పోలీసులు నవుడూరుకు చేరుకున్నారు.  నిర్బంధంలో ఉన్న అమ్మాయిని విడిపించారు. బాధిత యువతి,  ప్రియుడు రమేష్, అతని తల్లిదండ్రుల పై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు రమేష్ ,మరో ఏడుగురు పై కేసులు నమోదు చేసారు..

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:The boyfriend who kidnapped the young woman he loved

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page