మాస్క్ అందరూ తప్పనిసరిగా ధరించాలి

0 13

జూటూరు గ్రామ ప్రజలకు అవగాహన
పత్తికొండ ముచ్చట్లు:

పత్తికొండ మండల పరిధిలోని జూటూరు గ్రామంలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని అందరూ కలిసి సంపూర్ణంగా తరిమేయాలని గ్రామ సర్పంచ్ కాత్రిక జయశ్రీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని జూటూరు గ్రామంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది మాస్కులు ధరించి గ్రామ పురవీధుల వెంట తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ తీసేసిన సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. మాస్కులు తీసివేస్తే తప్పకుండా కరోనా ఆహ్వానించినట్లు అన్నారు. వేడిగా ఉందని మాస్కు తీసేస్తే కరోనా కు దారి ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఓకే ప్లేట్లు కలిసి భుజించిన, పక్క పక్కన కూర్చున్నా, ఎదురెదురు కూర్చున్న కరోనాను పంచుకున్నట్లు అవుతోందన్నారు. ఒకరే మాస్క్ వేసుకుంటే కరోనా పోదని, పక్క వారు కూడా మాస్క్ వేసుకుంటే కరోనాను సంపూర్ణంగా నిర్మించినట్లు అవుతుందన్నారు. ఎవరైనా ఎంతటివారైనా ఇంటి బయటకు వస్తే సామాజిక దూరం పాటిస్తే కరోనాకు గురికాకుండా ఉంటామన్నారు. కరోనా మహమ్మారి విషయంలో ఒక్కరు నిర్లక్ష్యం చేసిన గ్రామానికి ప్రమాదం అన్న విషయాన్ని ప్రజలు గ్రహించి తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామంలో ఎక్కడ కూడా గుంపులుగా ఉండటం మానుకోవాలన్నారు. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు కూడా మాస్కులు వేసుకుని బౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు కరచాలనం చేయకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వాతి,సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:The mask is a must-wear for everyone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page